30, అక్టోబర్ 2010, శనివారం

పరిచయం

జ్యోతిష్యం అనేది భారతదేశములో ఉన్న శాస్త్రములలో ఒక గొప్ప శాస్త్రము.  భారతదేశంలో ఎందరో  ఋషులు ఈ జ్యోతిష్య శాస్త్రమును చాలా గొప్పగా అభివృద్ధి చేశారు.  వారి దివ్య చక్షువులు ద్వారా ఆకాశంలో ఎక్కడో దూరంగా కంటికి కనిపించనంత దూరంలో ఉన్న గ్రహాలను, వాటి స్వరూపాలను, వాటి విశిష్టతను తెలియజేసారు.  ఈ జ్యోతిష్య శాస్త్రము
౧.  సిద్ధాంత  భాగము 
౨. జాతక భాగము 
౩.  ముహూర్త భాగము
అను మూడు భాగాలుగా తెలియజేయబడి వున్నది.  పూర్వము అనేకమంది మహర్షులు  ఈ జ్యోతిష్య శాస్త్రములో అనేక గ్రంథాలు రచించి వున్నారు. వారిలో బ్రహ్మ, వశిష్టుడు, అత్రి, గౌతముడు, మనువు, కాళిదాసు,  పౌలస్తుడు, రోమసుడు, మరీచి, అంగీరసుడు, వ్యాసుడు, నారదుడు,  శౌనకుడు,  భ్రుగువు, చ్యవనుడు, యవనుడు, గర్గుడు, కశ్యపుడు, పరాశరుడు మొదలైనవారు ముఖ్యులుగాను యింకా మరెందరో వున్నారు.  ముఖ్యముగా ఈ జోతిష్య శాస్త్రములో పరాశర, జైమిని, శ్రీపతి అను మూడు పద్ధతులు వాడుకలో వున్నవి. నేడు  మనదేశములో పరాశరపద్ధతి ఎక్కువ వాడుకలోను, ఎక్కువగా ప్రజాదరణ పొందినదిగా చెప్పవొచ్చును.   జైమిని మహర్షి రచించిన జైమినిపద్ధతి కూడాను వాడుకలో వున్నది.  కొందరు పరాశర, జైమిని రెండు పద్ధతులను కలిపి ఫలితాలు  చెప్పిరి.  మనము చేయు ప్రతి పని కూడాను కర్మగా చెప్పవొచ్చును. మరి ఆ కర్మనే వృత్తి  గా పిలువబడుతున్నది.  తాము పూర్వజన్మలో చేసిన కర్మఫలితములను బట్టి ఈజన్మలో శుభాశుభ ఫలితాలుగా పొందుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి